సామాజిక సారథి, తిమ్మాజిపేట: మద్యం డిపోలో హమాలీలుగా పని చేసేందుకు తమకు అవకాశం ఇవ్వాలని నిరుద్యోగ యువకులు మంగళవారం డిపో ఇన్ చార్జి డీఎం వినతిపత్రం అందజేశారు. తిమ్మాజీపేటకు చెందిన పలువురు నిరుద్యోగులు స్థానిక అంబేద్కర్ విగ్రహం నుంచి 100వరకు ర్యాలీగా బయలుదేరారు. స్పందించిన డిఎం నిరుద్యోగుల వినతిని ఉన్నతాధికారులకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళుతాని చెప్పారు.