త్వరలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్న సూపర్‌స్టార్ రజినీకాంత్ 70వ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయనుండడంతో బర్త్ డే వేడుకలకు ప్రత్యేకత సంతరించుకుంది. ఉదయమే రజనీ అభిమాన సంఘం (మక్కల్ మన్రం) సభ్యులు బ్యానర్లు కట్టి, రజనీకాంత్ ఫొటోలు ఉన్న టీ షర్టులను ధరించి సందడి చేశారు. ‘ప్రియమైన రజనీకాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను’ అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ విషెస్ చెబుతూ […]