Breaking News

LUNGS

కరోనా లక్షణాలతో యువతి మృతి

సారథి న్యూస్, వరంగల్ రూరల్: కరీంనగర్​ జిల్లా చెన్నరావుపేట మండలం పాపయ్యపేటకు చెందిన ఓ యువతి కరోనా లక్షణాలతో మృతిచెందింది. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న సదురు యువతిని గురువారం తల్లిదండ్రలు వరంగల్​లోని ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె నుంచి శాంపిల్స్​ సేకరించే లోపే మృతిచెందిందని వైద్యులు తెలిపారు. కాగా పాపయ్యపేటలో యువతి అంత్యక్రియల్లో పాల్గొన్నవారిని హోంక్వారంటైన్​లో ఉంచారు. గ్రామస్థులంతా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అధికారులు కోరుతున్నారు.

Read More