సారథి, పెద్దశంకరంపేట: తెలంగాణ స్టేట్ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలో ఖాళీగా ఉన్న రెండు ఎంపీటీసీ స్థానాలతో పాటు వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహణలో భాగంగా గ్రామపంచాయతీ ఆఫీసుల్లో ముసాయిదా ఓటర్ల జాబితాను అందుబాటులో ఉంచినట్లు ఎంపీడీవో రాజ్ నారాయణ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన గ్రామ పంచాయతీలలో నోటిస్ అతికించినట్లు ఆయన చెప్పారు. కోళ్లపల్లి, పెద్దశంకరంపేట పరిధిలోని 1వ ఎంపీటీసీ స్థానం, ఇస్కపాయల తండా, మక్తలక్ష్మాపూర్ వార్డు […]