Breaking News

LALGI TANDON

మధ్యప్రదేశ్​ గవర్నర్​ కన్నుమూత

లక్నో: మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్​జీ టాండన్​ (85) మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఈ మేరకు ఆయన కుమారుడు అశుతోష్​ ట్వీట్​చేశారు. ఆయన కొంతకాలంగా జ్వరం, మూత్రపిండాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. నెల క్రితం లక్నోలోని ఓ ఆస్పత్రిలో చేరారు. టాండన్​ మాజీ ప్రధాని వాజపేయికి సన్నిహితుడు. ఉత్తర్​ప్రదేశ్​ మంత్రిగా కొంతకాలం పనిచేశారు. చిన్నప్పటినుంచే టాండన్​ ఆరెస్సెస్​లో క్రియాశీలకంగా ఉండేవారు. తర్వాత జనసంఘ్​లో చేరారు. టాండన్​ మృతికి ప్రధాని మోదీ, కేంద్రమత్రి స్మృతి ఇరానీ సంతాపం తెలిపారు.

Read More