Breaking News

KRISHNA RIVER

జూరాల 6 గేట్ల ఎత్తివేత

జూరాల 6 గేట్ల ఎత్తివేత

సారథి న్యూస్, జూరాల: జోగుళాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు ఆరుగేట్లను బుధవారం ఎత్తి 34,320 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి ప్రాజెక్టుకు 60వేల క్యూసెక్కుల వరద వచ్చిచేరుతోంది. ఎగువ, దిగువ విద్యుదుత్పత్తి కేంద్రాల్లో విద్యుత్​కోసం 21,240 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. జూరాల నుంచి మొత్తంగా 59,380 క్యూసెక్కులను శ్రీశైలానికి వదులుతున్నారు. దీంతో కృష్ణమ్మ పరుగులు తీస్తోంది.

Read More

జూరాల నీటివిడుదల

సారథి న్యూస్, మహబూబ్ నగర్: ఈ ఏడాది తొలిసారి 20 రోజుల ముందుగానే ఆదివారం జూరాల ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటిని మంత్రి ఎస్.నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అబ్రహాం, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి విడుదల చేశారు. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి నీరు జూరాల ప్రాజెక్టుకు చేరకపోయినా జూరాల కుడి ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేశారు. ఈ సారి ఎగువ భారీగా వర్షాలు […]

Read More
జూరాల వైపు కృష్ణమ్మ

జూరాల వైపు కృష్ణమ్మ

సారథి న్యూస్, గద్వాల: కర్ణాటకలోని నారాయణ్ పూర్ డ్యాం నుంచి కృష్ణానది నీటిని ఆదివారం నీటిపారుదల శాఖ అధికారులు విడుదల చేశారు. రెండుగేట్లను ఒక మీటర్ పైకి ఎత్తి 11,240 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో కృష్ణాజలాలు జూరాల వైపు పరుగులు తీస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్​ ప్రాజెక్టులను నింపి తెలంగాణలోని ప్రాజెక్టుల వైపు కృష్ణమ్మ పరవళ్లు ప్రారంభమయ్యాయి. ఆల్మట్టి జలశయానికి ఎగువ నుంచి 69వేల […]

Read More
కృష్ణమ్మ బిరబిరా పరుగులు

కృష్ణమ్మ బిరబిరా పరుగులు

సారథి న్యూస్​, గద్వాల: ఏడాది నైరుతి రుతుపవనాలు తొందరగానే పలకరించాయి. సకాలంలో వర్షాలు కురుస్తుండడంతో రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరుతోంది. కర్ణాటకలో వర్షాలు కురుస్తుండడంతో కృష్ణమ్మకు జలకళ సంతరించుకుంది. దీంతో ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి దిగువకు బిరబిరా పరుగులుతీస్తోంది. కొన్ని ప్రాజెక్టుల నుంచి పంపింగ్​లను కూడా ప్రారంభించి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ఇరిగేషన్​ శాఖ రిపోర్టు ఆధారంగా ఎప్పటికప్పుడు సాగునీటి వివరాలను అందిస్తున్నాం. ప్రాజెక్టులు పూర్తి నిల్వ ప్రస్తుతం ఇన్ […]

Read More