సారథిన్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతున్నదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని రూ.2.20 కోట్లతో ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, మున్సిపల్ చైర్మన్ కాపు సీతామహాలక్ష్మీ తదితరులు ఉన్నారు.