సారథి, సిద్దిపేట ప్రతినిధి, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ సమరయోధులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్వాతంత్ర్య సమరయోధుల సంఘం ఉపాధ్యక్షుడు కొండ చిన్న మల్లయ్య శుక్రవారం అనారోగ్యంతో కన్నుమూశారు. మల్లయ్య మృతిపట్ల టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ బొమ్మ శ్రీరాం చక్రవర్తి ఆయన భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి […]