సారథి, కొల్లాపూర్: కొల్లాపూర్ మున్సిపల్ కార్మికులకు 11వ పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్చేస్తూ బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపల్ ఆఫీసు ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకుడు శివవర్మ మాట్లాడుతూ.. కరోనా సమయంలో ప్రజలను కాపాడిన మున్సిపల్ సిబ్బంది కృషి మరువలేనిదని కొనియాడారు. పెంచిన వేతనాలను జూన్ నుంచి అమలు చేయాలని డిమాండ్చేశారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, ఎలక్ట్రిషన్ సిబ్బంది, బిల్ కలెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, అటెండర్లు, […]