సారథి, కొల్లాపూర్(కోడేరు): కరోనా కల్లోలం కొనసాగుతున్న తరుణంలో గ్రామీణ ప్రాంతవాసులకు వైద్యసేవలు అందించేందుకు అమెరికన్ తెలంగాణ సొసైటీ(ఏటీఎస్), తెలంగాణ ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్(టీటా) వేగంగా ముందుకు తీసుకుపోతున్నాయి. కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించేందుకు నారాయణపేట జిల్లా మాగనూర్ లో తొలి దవాఖానను గతనెల ప్రారంభించారు. కొనసాగింపుగా శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కోడేర్ లో కొవిడ్ హాస్పిటల్ ను ఎస్పీ పి.సాయిశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా టీ.కన్సల్ట్ ద్వారా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ […]