ముంబై: క్రికెట్ షెడ్యూల్ బిజీగా ఉంటున్న నేపథ్యంలో.. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ శర్మతో కలిసి పంచుకోవాలని భారత మాజీవికెట్ కీపర్ కిరణ్ మోరె అన్నాడు. ఏడాది మొత్తం ఒకరే నాయకుడిగా వ్యవహరించడంతో బరువు పెరుగుతుందన్నాడు. ఒక జట్టు.. ఇద్దరు సారథుల అంశంపై మోరె మాట్లాడుతూ.. ‘బీసీసీఐ ఈ అంశంపై దృష్టిపెట్టాలి. టీమిండియా అన్ని ఫార్మాట్లతో కలిపి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కూడా కోహ్లీయే కెప్టెన్గా ఉన్నాడు. తద్వారా ఒత్తిడి, బాధ్యతలు పెరిగిపోతున్నాయి. ఇది కొనసాగడం […]