సారథి న్యూస్, హైదరాబాద్: గుస్సాడి కళాకారుడు కనకరాజు తెలంగాణ రాష్ట్రం నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకోవడం ఈ రాష్ట్రానికే గర్వకారణమని గవర్నర్ తమిళసై సౌందర్‌రాజన్ అన్నారు. తనకు గిరిజనులు అంటే చాలా అభిమానమని అన్నారు. తాను గవర్నర్ కాక ముందు నుంచే గిరిజనులతో ఎంతో అవినాభావ సంబంధం కలిగి ఉన్నానని వెల్లడించారు. గిరిజనుల వైద్యానికి ప్రత్యేకత ఉందన్నారు. గిరిజనులు ఆచార వ్యహారాల వల్ల వారి వయసుకు తగినట్లుగా కాకుండా ఇంకా యవ్వనంగా ఉంటారని అన్నారు. పద్మశ్రీ అవార్డు […]