సారథి న్యూస్, కామారెడ్డి: ఇతరులకు చెందిన భూమిని తన పేరిట పట్టా చేయాలని ఓ మాజీ నక్సలైట్ ఏకంగా తహసీల్దార్‌నే బెదిరించాడు. పట్టా చేయకపోతే చంపేస్తానని హెచ్చరించాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డిలో చోటుచేసుకుంది. రామారెడ్డి మండల తహసీల్దార్ షర్ఫుద్దీన్‌పై గిద్ద గ్రామానికి చెందిన మాజీ నక్సలైట్ నర్సారెడ్డి బెదిరింపులకు దిగాడు. ఇతరులకు చెందిన ఆరెకరాల భూమిని తన పేరిట రికార్డు చేయాలని బెదిరించాడు. దీంతో భయానికి లోనైన తహసీల్దార్ షర్ఫుద్దీన్ రామారెడ్డి పోలీసులకు ఫిర్యాదుచేశారు. […]
సారథి న్యూస్, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్ర శివారులో చెట్టుకు ఉరివేసుకుని ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు. శనివారం ఉదయం గ్రామస్తులు గుర్తించారు. మృతులను మాచారెడ్డి గ్రామానికి చెందిన బాలనర్సు(38), ప్రేమలత(35)గా గుర్తించారు. మృతులు ఇద్దరికి కూడా పెళ్లిళ్లు అయి పిల్లలు కూడా ఉన్నారు. వేర్వేరు కుటుంబాలకు చెందిన వీరు ఆత్మహత్య చేసుకోవడానికి వివాహేతర సంబంధమే కారణమని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.