సారథి న్యూస్, ఖమ్మం: ప్రత్యేక రాష్ట్రంలో సాగునీటి రంగం పూర్తిగా అధోగతి పాలైందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. సీఎల్పీ సారథ్యంలోనూ ప్రాజెక్టును పరిశీలించేందుకు ఈనెల 18న కల్వకుర్తికి వెళ్తున్నట్లు భట్టి చెప్పారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ఈనెల 11న ఖమ్మం జిల్లాలో ట్రాక్టర్లతో భారీర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆదివారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వర్రావు, ఖమ్మం నగర […]