– ఎమ్మెల్యే డాక్టర్ పీవీ సిద్ధారెడ్డి నివాళి సారథి న్యూస్, అనంతపురం: ఫిలిప్సైన్స్ లో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన అనంతపురం జిల్లా కదిరి పట్టణానికి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి రేవంత్ కుమార్(22) మృతదేహాన్ని శుక్రవారం స్వస్థలానికి తీసుకొచ్చారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పీవీ సిద్ధారెడ్డి అక్కడికి చేరుకుని నివాళులర్పించారు. కదిరి, అనంతపురం పట్టణాలకు చెందిన రేవంత్‌కుమార్(22), వంశీ(19) ఫిలిప్సైన్స్‌లో ఎంబీబీఎస్ చదువుతున్నారు. ఏప్రిల్ 6న అక్కడ జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ మృతిచెందారు. […]