న్యూఢిల్లీ: ట్రిపుల్ ఒలింపియన్, హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ సీనియర్ (96) ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారింది. ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నాడు. బల్బీర్ బ్రెయిన్ లో రక్తం గడ్డకట్టిందని, ఎంఆర్ఐ స్కానింగ్ లో తేలిందని బల్బీర్ మనవడు కబీర్ తెలిపాడు. ‘కొన్ని రోజులుగా గుండెపోటు రాలేదు. అయినా పరిస్థితిలో మార్పు లేదు. బల్బీర్ స్పృహలో లేరు. వెంటిలేటర్ సాయంతోనే శ్వాస అందిస్తున్నారు. డాక్టర్లు పరిస్థితిని సమీక్షిస్తున్నారు’ అని కబీర్ వెల్లడించాడు.