సారథి, బిజినేపల్లి: జేఎస్‌డబ్ల్యూ పెయింట్స్ సంస్థ వారు నిర్వహించిన జాతీయస్థాయి చిత్రలేఖనం పోటీల్లో నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి సాంఘిక సంక్షేమశాఖ బాలుర గురుకుల స్కూలు విద్యార్థి బి.శివకుమార్ ఉత్తమ ప్రతిభ చాటాడు. గురువారం స్కూలు ఆర్ట్ టీచర్ భాగ్యమ్మ, ప్రిన్సిపల్‌తో కలిసి గురుకుల విద్యాలయాల సంస్థ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థి బి.శివకుమార్‌ను సన్మానించారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహించిన తీరును అభినందించారు. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు అకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను […]