సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా(కోవిడ్ –19)తో జర్నలిస్ట్ మనోజ్ కుమార్ మృతిచెందడం బాధాకరమని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఆదివారం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మనోజ్ కుమార్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కరోనా బారినపడి ఓ తెలుగు జర్నలిస్ట్ మృత్యువాతపడడం ఎంతో కలచి వేసిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మినహా మరో మార్గం లేనందున జర్నలిస్టులు ఎక్కువ […]