సారథి న్యూస్, రామాయంపేట: ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్, జయంతి ఘోష్ ఇచ్చిన సిఫార్సులను అమలు చేయాలని రైతు స్వరాజ్య వేదిక జిల్లా కమిటీ సభ్యులు దుబాసి సంజీవ్ డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన దేశంలో 60శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, ఏడాది కాలంగా కరోనా మహమ్మారితో రైతులు ఇబ్బందిపడుతున్నారని వివరించారు. […]