న్యూఢిల్లీ: భారత్‌లో పేస్ బౌలింగ్ విప్లవం.. జవగల్ శ్రీనాథ్లోనే మొదలైందని హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. అప్పటివరకు స్పిన్‌పై ఆధారపడిన టీమిండియాలో.. ఒక్కసారిగా మార్పు మొదలైందన్నాడు. అలా మొదలైన మార్పు.. ఇప్పుడు అద్భుత ఫలితాలను అందిస్తోందన్నాడు. ‘శ్రీనాథ్.. మైసూర్ నుంచి వచ్చిన ఓ ఘటికుడైన ఫాస్ట్ బౌలర్. భారత పేస్ బౌలింగ్ దళానికి ఓ ప్రేరణగా నిలిచాడు. ఓ విప్లవాన్ని రగిల్చాడు. ఆ విప్లవమే ఇప్పుడు ప్రపంచ స్థాయి పేస్ బౌలింగ్‌కు మార్గదర్శకమైంది. కఠిన పరిస్థితుల్లోనూ […]