సారథి న్యూస్, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం పాతాళగంగ వద్ద శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ టీఎస్ జెన్ కో విద్యుత్ కేంద్రం మొదటి యూనిట్లోని ఓ ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా గురువారం అర్ధరాత్రి సమయంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా పెద్ద పేలుడు శబ్దం సంభవించి మంటలు ఎగిసిపడడంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి. జీరో లెవెల్ నుంచి సర్వీస్ బే వరకు మంటలు వ్యాపించాయి. ఉద్యోగులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. […]