సారథి న్యూస్, అలంపూర్: జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం పోలీస్ చెక్ పోస్ట్ వద్ద పోలీస్ సిబ్బంది, విలేకరులకు జడ్పీ చైర్ పర్సన్ సరిత ఆదివారం సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ హనుమంతురెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ధర్మవరం రంగారెడ్డి, ఎంపీపీ స్నేహ, వైస్ ఎంపీపీ సుజాత, షేక్ పల్లి సర్పంచ్ రవీందర్ రెడ్డి, ఎర్రవల్లి ఎంపీటీసీ ఎల్కుర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.