ప్రస్తుతం ముంబైలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ వైరస్ బారినపడ్డారు. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌కు కరోనా సోకడంతో.. దేశం మొత్తం ఒక్కసారిగా షాక్‌కి గురైంది. కాగా, ప్రస్తుతం వీరిద్దరూ ఐసోలేషన్ వార్డులో చికిత్స తీసుకుంటున్నారు. అమితాబ్ మూత్రపిండాల నొప్పితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరగా.. ఆయనకు వైద్యులు కరోనా పరీక్షలు చేశారు. ఈ రిపోర్ట్స్‌లో బిగ్‌బీకి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. […]