సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో ఈజ్ఆఫ్ డూయింగ్బిజినెస్కు మరిన్ని సంస్కరణలు తీసుకురాబోతున్నట్లు మంత్రి కేటీఆర్ప్రకటించారు. బుధవారం హైదరాబాద్‌లోని జలమండలిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో కలిసి సమీక్షించారు. న్యాయ, టూరిజం, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ సివిల్ సప్లయీస్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, సీసీఎల్ఏ వంటి పలు శాఖలపై వివరాలు అందజేసి చేపట్టాల్సిన సంస్కరణలపై ఆయా సెక్రటరీల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించారు. టీఎస్ బీపాస్ సౌకర్యవంతంగా, సులభంగా, పారదర్శకంగా ఉందన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ సెక్రటరీ జయేశ్ రంజన్, […]