సారథి, వేములవాడ: రాష్ట్రంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. కోడె మొక్కులు చెల్లించుకున్న అనంతరం స్వామివారిని మంత్రి దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయ ఈవో, అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. మహామండపంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఆలయ ఈవో కృష్ణప్రసాద్ చిత్రపటం, ప్రసాదం అందజేసి సత్కరించారు. మంత్రి వెంట ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్, కలెక్టర్ కృష్ణభాస్కర్ తదితరులు ఉన్నారు. వసతిగృహాల ప్రారంభంవేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నూతనంగా […]
సారథి న్యూస్, నిర్మల్: తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు, ఆలిండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అజ్మీరా శ్యాంనాయక్ ఆదివారం కలిశారు. జమ్మూ కాశ్మీర్ లో ఉన్న వైష్ణవి మాత ఆలయం నుంచి తెచ్చిన తీర్థప్రసాదాన్ని అందజేశామని తెలిపారు.