ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. శనివారం రాత్రి వరకు రాష్ట్రంలో 3,00,937 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 8,348 కొత్త కేసులు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 11,596 మంది కరోనాతో మృతిచెందారు. కాగా లక్షా 65 వేల మంది వ్యాధినుంచి కోలుకున్నారు. దేశంలో అత్యధిక కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి.