సారథి న్యూస్, వెంకటాపూర్: పేదలకు సహాయం చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకురావాలని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ పిలుపునిచ్చారు. పేదలకు సాయం చేయాలనే సదుద్దేశంతో హృదయ్(ఎన్జీవో) స్వచ్ఛంద సంస్థ సీఈవో షేక్ యాకూబ్ పాషా గూంజ్ సంస్థ సహకారంతో బుధవారం 220 కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు అందజేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. సమాజంలో చాలా మంది ఆకలితో ఆలమటిస్తూ ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. అలాంటి పేదలు ఎక్కడున్నా వారికి చేయూతనందించి దాతృత్వం చాటుకోవాలని […]