న్యూఢిల్లీ: ఆగస్టు 15వ తేదీ తర్వాతే స్కూళ్లు తెరుచుకునే అవకాశం ఉందని కేంద్రమానవ వనరుల అభివృద్ధి(హెచ్ఆర్డీ)శాఖ వర్గాలు సూచన ప్రాయంగా తెలిపాయి. దేశవ్యాప్తంగా కేసుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశాయి. కేంద్రహోం, ఆరోగ్యశాఖలు జారీచేసిన మార్గదర్శకాల మేరకు స్కూళ్ల ఓపెనింగ్ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వెల్లడించాయి. విద్యార్థుల రక్షణను దృష్టిలో ఉంచుకుని స్కూళ్ల ఓపెనింగ్ విషయాన్ని ఖరారు చేయొచ్చని పేర్కొన్నాయి. కేంద్ర హెచ్ఆర్డీ మంత్రి రమేశ్ […]