Breaking News

HOME MINISTER

కోలుకున్న మహమూద్‌ అలీ

సారథిన్యూస్​, హైదరాబాద్‌: రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ కరోనా నుంచి కోలుకున్నారు. శుక్రవారం చేసిన పరీక్షలో ఆయనకు నెగెటివ్​ వచ్చింది. మంత్రితోపాటు ఆయన కుమారుడు, మనువడు కూడా శుక్రవారం డిశ్చార్జ్‌ అయ్యారు. ఆదివారం మంత్రికి కోవిడ్‌ పరీక్షలు చేయగా పాజిటివ్‌ రావడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. ‘మేం త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన  ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు’ అని మంత్రి తెలిపారు. ఇప్పటికే ఆయన  సిబ్బందిలో ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. 

Read More