సారథి, చొప్పదండి: చొప్పదండి మున్సిపల్ ఆఫీసులో చైర్ పర్సన్ గుర్రం నీరజారెడ్డి అధ్యక్షతన కమిషనర్ అంజయ్య ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బందికి బ్లాంకెట్స్, బల్బ్స్, ఆఫ్రాన్స్, హెల్మెట్స్, గమ్ బూట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ.. కార్మికులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ ఇప్పనపెళ్లి విజయలక్ష్మి, కౌన్సిలర్లు మాడూరి శ్రీనివాస్, […]