సారథి న్యూస్, కొత్తగూడెం: కొత్తగూడెం పట్టణంలో సుమారు ఐదొందల మంది దివ్యాంగులకు బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలను టీఆర్ఎస్ నాయకుడు వనమా రాఘవేంద్రరావు గురువారం పంపిణీ చేశారు. దివ్యాంగులను ఆదుకోవడమే తమ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, ఎంఏ రజాక్ తదితరులు పాల్గొన్నారు.