న్యూఢిల్లీ: మన దేశంలోని సైబర్ సెక్యూరిటీ నోడల్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్‌టీ–ఇన్) ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్‌కు నోటీసులు జారీచేసింది. ఇటీవల హై ప్రొఫైల్ ట్విట్టర్ అకౌంట్లు హ్యాకింగ్‌కు గురైన విషయంపై పూర్తి వివరాలు ఇవ్వాలని నోటీసులు జారీ చేసినట్లు ఏజెన్సీలోని ఒక అధికారి మీడియాతో చెప్పారు. హ్యాకర్లు పెట్టిన లింక్‌లను సందర్శించిన భారతీయ వినియోగదారుల సంఖ్య, వారికి కలిగిన నష్టం గురించి, ఆ అకౌంట్ల గురించి వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదా […]