ప్రకృతి మనకు ఎంతో ఇచ్చింది.. ప్రతీది అపురూపంగానే కనిపిస్తోంది.. ప్రతి దృశ్యం ఆహ్లాదం కలిగిస్తుంది.. తియ్యటి జ్ఞాపకాలు.. మరిచిపోలేని అనుభూతులు.. మధుర ఘట్టాలు.. గొప్ప సన్నివేశాలు.. వెలకట్టలేని దృశ్యాలను పదికాలాల పాటు మన కళ్లముందు పదిలంగా ఉంచేదే ఫొటో. ఫొటోగ్రఫీ అనేది సృజనాత్మక కళ. వంద మాటల్లో చెప్పలేనిది ఒక్కఫొటోతో చెప్పొచ్చు. మనసు దోచే రమణీయ దృశ్యాలు.. ఆలోచింపజేసే రూపాల సమాహారమే ఫొటోగ్రఫీ. ఆగస్టు 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఆకట్టుకునే చిత్రాలు కొన్ని మీ […]