సారథి న్యూస్, నారాయణపేట: నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్‌పల్లి గ్రామానికి చెందిన నాగప్ప గ్రామంలోని సర్వేనం.230, 225, 248లో 4.20 ఎకరాల భూమి కాస్తులో ఉన్నారు. కాగా, ఈ భూమి గ్రామానికి చెందిన ప్రభాకర్ రావు పేర పట్టా ఉంది. ప్రభాకర్ రావు మృతి చెందడంతో ఆయన కొడుకు గంగాసాగర్ రావు విరాసత్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కాగా, కొన్నేళ్లుగా తామే కాస్తులో ఉండి పంటలు సాగు చేస్తున్నామని, తమకు పట్టా అమలుచేసి ఇవ్వాలని గంగాసాగర్రావును […]