న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్లో అత్యంత మెరుగైన ఫిట్నెస్ కలిగిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తన ఫిట్నెస్ను కాపాడుకోవడానికి చేసే కసరత్తులు కూడా అంతే తీవ్రంగా ఉంటాయి. కరోనా లాక్డౌన్తో ఇంటికే పరిమితమైన విరాట్.. కసరత్తులు మాత్రం మానలేదు. అతను చేసే కొత్త రకం ఎక్సర్సైజ్లకు సంబంధించిన వీడియోలను అప్పుడప్పుడు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటాడు. తాజాగా అతను పోస్ట్ చేసిన ఓ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఎగురుతూ పుష్ అప్స్ చేసే క్రమంలో నేలను తాకక ముందే […]