వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారి మాస్క్ ధరించి ప్రత్యక్షమయ్యాడు. తాజాగా వాషింగ్టన్ సమీపంలోని వాల్టర్రీడ్ మిలటరీ దవాఖానను సందర్శించిన ఆయన మాస్కును ధరించాడు. అమెరికాలో కరోనా విజృంభిస్తున్నప్పటికీ ట్రంప్ మాస్క్ ధరించలేదు. మాస్క్ ఎందుకు పెట్టుకోరంటూ మీడియా ప్రశ్నించిన ప్రతిసారి.. ఎదురు దాడికి దిగేవారు. ఈ క్రమంలో తొలిసారిగా మాస్క్ ధరించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అమెరికాలో త్వరలో ఎన్నికలు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రత్యర్థులు మాస్క్ అంశాన్ని రాజకీయం చేస్తున్నారు. […]