సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో గురువారం ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని మామిడితోటతో పాటు పశుగ్రాసం దగ్ధమైంది. బోయిని రాములుకు చెందిన మొక్కజొన్న పంట రెండు ఎకరాల్లో దగ్ధమైంది. మాజీ ఉపసర్పంచ్ కడారి వీరయ్యకు చెందిన గడ్డివాముతో పాటు పైపులు, వైర్లు కాలిపోయాయి. రాగం భూలక్ష్మికి చెందిన మామిడి తోటలో సుమారు 50 చెట్లు కాలిబూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.ఆరులక్షల నష్టం వాటిల్లందని […]