సారథి, సిద్దిపేట ప్రతినిధి: నియోజకవర్గ కేంద్రమైన హుస్నాబాద్ పట్టణంలోని నాలుగో వార్డు పరిధిలోని బాలాజీనగర్, కాకతీయ నగర్ లో ఇంటింటా ఫీవర్ సర్వే నిర్వహించారు. అలాగే కరోనా వ్యాధి పీడితుల యోగక్షేమాలను సిబ్బంది అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఐలేని అనితారెడ్డి, ఆర్ పీ శోభ, ఆశావర్కర్ కాంత పాల్గొన్నారు.