రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ సామాజిక సారథి, నర్సాపూర్: సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అణగారినవర్గాల కోసం ఎనలేని కృషిచేసిన గొప్ప వ్యక్తి అని ఎక్సైజ్‌శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. ఆయన బాటలో ప్రతిఒక్కరూ నడుచుకోవాలని పిలుపునిచ్చారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 371వ జయంతి ఉత్సవాలను బుధవారం మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఘనంగా నిర్వహించారు. గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, బీజేపీ నాయకులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాల […]