ముంబై వద్ద దాటిన తీరం గంటకు 110 కి.మీ.ల వేగంతో గాలులు ప్రజలంతా ఇంట్లోనే ఉండండి: ప్రభుత్వం లక్షలాది మందిని పునరావాసాలకు తరలింపు ముంబై: నిసర్గ తుఫాన్ బుధవారం ఉదయం తీవ్రరూపం దాల్చింది. ఇది తీవ్ర తుఫాన్‌గా మారిందని వాతావరణ అధికారులు చెప్పారు. తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా ఇది కొనసాగుతోందని, బుధవారం మధ్యాహ్నం హరిహరేశ్వర్, దామన్ మధ్య అలీబాగ్‌కు సమీపంలో తీరం దాటింది. దీంతో మహారాష్ట్రలో భారీవర్షాలు కురిశాయి. తీరం దాటే సమయంలో గంటకు […]
బంగాళాఖాతంలో సూపర్ సైక్లోన్ గా తుఫాన్ ఒడిశా, బెంగాల్ ప్రభుత్వాలు అలర్ట్ సాయంత్రం ప్రధాని ఉన్నతస్థాయి సమీక్ష దిల్లీ: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఎంఫాన్ అతి తీవ్ర తుఫాన్‌గా కొనసాగుతోంది. ప్రస్తుతం పారాదీప్‌కు దక్షిణంగా 780 కి.మీలు, బెంగాల్‌లోని దిఘాకు 930 కి.మీల దూరంలో కేంద్రీకృతమైన ఈ పెను తుఫాన్ సోమవారం సాయంత్రానికి సూపర్ సైక్లోన్‌గా మారే అవకాశం ఉందని హోంమంత్రిత్వశాఖ తెలిపింది. ఈ తుఫాన్ తీవ్రతపై సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. […]