తరతరాల తెలుగు.. ఇలా వెలుగుఏ ప్రపుల్ల సుమంబుల ఈశ్వరునకుపూజ సల్పితినో యేను పూర్వమందుకలదయేని పునర్జన్మ కలుగుగాకమధుర మధురమౌ తెలుగు నా మాతృభాష!!– అని రాయప్రోలు సుబ్బారావు తేట తెలుగు మాధుర్యాన్నితీయనైన పద్యం ద్వారా చెప్పారు.ఆయనే ఓ మాట అన్నారు..‘ఏ దేశమేగినా.. ఏ పీఠమెక్కినా పొగడరా నీతల్లి భారతిని’ అని ఆ వాక్యాన్ని కాస్తా తెలుగుకు అన్వయించుకుంటే మనం ఎక్కడున్నా, రెండు రాష్ట్రాల వారమైనా తెలుగు వారమే. ఆ భాషా మాధ్యుర్యాన్ని తొలి గురువు అమ్మనోట విని పులకించినవారమే. […]
ఒక వ్యక్తి నిర్మాణానికి తొలి పాఠశాలగా తాను పుట్టిపెరిగిన గృహమే ఆధారంగా నిలుస్తుందని సామాజిక శాస్త్రజ్ఞులు చెబుతుంటారు. ఈ స్థితిలో చిన్నారులను మనం తీర్చిదిద్ద గలిగినప్పుడు వారి వ్యక్తిత్వ నిర్మాణం, మనోవికాసం ఎదిగాక సమాజంలో సాగించే మనుగడకు ఆలంబనగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. ఇందుకు తొలి పాఠశాల అయిన ఇంటిని.. బిడ్డలను తీర్చిదిద్దే మహా ఆలయంగా ఎలా మలచాలన్నదే నేడు మన ముందున్న ప్రశ్న. దీన్ని చక్కదిద్దుకోకుండా మనమేమీ సాధించలేం. మనకో సామెత ఉంది ‘మొక్కై వంగనిదే […]