సారథి, చొప్పదండి: గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కరీంనగర్జిల్లా చొప్పదండి ఎంపీపీ చిలుక రవీందర్ పిలుపునిచ్చారు. మండలంలోని రుక్మాపూర్ గ్రామంలో 4వ విడత పల్లెప్రగతి గ్రామసభ ముద్దసాని చిరంజీవి సర్పంచ్ అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీపీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పది రోజుల కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ 10వ రోజు గ్రామ సభలో అభివృద్ధిని చూపించాలని గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని ఆదేశించారు. అనంతరం గ్రామ […]