Breaking News

COLNOL

కేసారంలోనే సంతోష్​ బాబు అంత్యక్రియలు

సారథి న్యూస్​, సూర్యాపేట: భారత్‌ సరిహద్దుల్లో చైనా దొంగ దెబ్బకు అమరుడైన కల్నల్‌ సంతోష్‌ బాబు పార్థివదేహం బుధవారం హైదరాబాద్‌లోని హకీంపేట విమానాశ్రయానికి చేరింది. వీరజవాన్​ పార్థివదేహానికి తెలంగాణ గవర్నర్‌ తమిళిసైతో మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ, మల్లారెడ్డి, ఎంపీ రేవంత్‌ రెడ్డి, డీజీపీ మహేందర్‌ రెడ్డి తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. సంతోష్‌బాబు భార్య, పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. ప్రత్యేకంగా అంబులెన్స్‌లో సంతోష్‌బాబు పార్థివదేహాన్ని సూర్యాపేటకు తరలించారు. తొలుత హైదరాబాద్‌లోనే అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులు […]

Read More

హకీంపేటకు కల్నల్ సంతోష్‌ పార్థివదేహం

సారథి న్యూస్​, హైదరాబాద్‌: భారత్ -చైనా సరిహద్దు ఘర్షణలో వీరమరణం చెందిన కల్నల్ బిక్కుమళ్ల సంతోష్‌ బాబు పార్థివదేహం బుధవారం హకీంపేట విమానాశ్రయానికి చేరింది. కల్నల్‌ సంతోష్‌ పార్థివదేహానికి గవర్నర్‌ తమిళిసైతో పాటు మంత్రులు కేటీఆర్‌, మల్లారెడ్డి నివాళులు అర్పించారు. గురువారం ఉదయం సూర్యాపేటలోని కేసారంలో కల్నల్‌ సంతోష్‌ అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో జరగనున్నాయి. అంతిమ యాత్ర కోసం అధికారులు ప్రత్యేక వాహనాన్ని సిద్ధంచేశారు.

Read More