సారథి న్యూస్, నారాయణపేట: నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం నిడ్జింత గ్రామంలో రూ.73 లక్షల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదులను మంత్రులు ఎక్సైజ్‌శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం ప్రారంభించారు. కలెక్టర్ హరిచందన, ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.