సారథి న్యూస్, హుస్నాబాద్: ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ కోరారు. గురువారం అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామంలో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. అడవులు అంతరించి పోవడంతో పొల్యూషన్ పెరుగుతుందన్నారు. ఎంపీపీ మాలోతు లక్ష్మి మాట్లాడుతూ..బర్త్ డే, పెండ్లి రోజు తీపిగుర్తులకు చిహ్నాంగా ముఖ్యమైన రోజుల్లో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీవో సత్యపాల్‌రెడ్డి, జడ్పీటీసీ మంగ, స్పెషలాఫీసర్ నర్సింగరావు, ఎంపీవో సుమాన్, ఏపీవో ప్రభాకర్, ఎస్సై కొత్తపల్లి రవి, సర్పంచ్ […]