దిగ్జజ నృత్య దర్శకురాలు సరోజ్ ఖాన్ (71) కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఆమెకు తీవ్రమైన గుండెపోటు రావడంతో మృతిచెందారు. గతనెల 20న ఆమె శ్వాసకోసం ఇబ్బందులతో ముంబైలోని గురునానక్ దవాఖానలో చేరారు. అనంతరం ఆమె పరిస్థితి మెరుగుపడటంతో డిశ్చార్జి చేశారు. ఇంతలోనే ఆమె కన్నుమూయడంతో బాలీవుడ్ సినీపరిశ్రమలో విషాదం నెలకొన్నది. సరోజ్‌ఖాన్ దాదాపు రెండువేల పాటలకు సరోజ్‌ఖాన్ కొరియోగ్రాఫ్ అందించారు. దేవదాస్లోని డోలారే డోలాకు ఆమె కొరియోగ్రఫీ చేశారు. శ్రీదేవి నటించిన […]