Breaking News

CHIDAMBARAM

కార్తీ చిదంబరానికి కరోనా

కార్తీ చిదంబరానికి కరోనా

చెన్నై: కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు చిదంబరం కుమారుడు, ఎంపీ కార్తీ చిదంబరానికి కరోనా ప్రబలింది. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్​ చేశారు. ఇటీవల ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకున్నారు. దీంతో ఆయనకు కరోనా నిర్ధారణ అయ్యింది. కాగా ఇటీవల కార్తీ అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తనను ఇటీవల కలిసిన వారంతా క్వారంటైన్​లో ఉండాలని, వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. మరోవైపు కార్తీ చిదంబరం కుటుంబసభ్యులంతా పరీక్షలు చేయించుకున్నారు.

Read More