న్యూఢిల్లీ: ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగాల్సిన బ్యాడ్మింటన్ ప్రపంచ జూనియర్ చాంపియన్ షిప్ ను రీషెడ్యూల్ చేశారు. దీంతో వచ్చే జనవరి 18 నుంచి 24వ తేదీ వరకు ఆక్లాండ్‌లో నిర్వహించనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) నిర్ణయం తీసుకుంది. అంతకంటే ముందు ప్రపంచ జూనియర్ మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్ జనవరి 11 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించేందుకు షెడ్యూల్ రూపొందించారు. ‘టోర్నీని విజయవంతం చేసేందుకు మేం కొత్త షెడ్యూల్‌ను […]