సారథి, కొల్లాపూర్: కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చుక్కయిపల్లి చాకలి మడుగువాగుపై రూ.40లక్షల వ్యయంతో చేపట్టనున్న కల్వర్టు బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి గురువారం భూమిపూజ చేశారు. చాకలిమడుగుపై కల్వర్టు బ్రిడ్జి లేక ప్రజలు, రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బ్రిడ్జి నిర్మించడం ద్వారా చుక్కయిపల్లి ప్రజలు, రైతుల కష్టాలు తీరనున్నాయని, రైతులు తమ పొలాలకు వెళ్లడానికి, ధాన్యాన్ని తరలించడానికి ఇబ్బందులు ఉండవని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గున్ రెడ్డి నరేందర్ […]