హైదరాబాద్: కరోనా వారియర్స్‌ను ప్రభుత్వం గుర్తించకపోవడం దారుణమని ఎంఐఎం సీనియర్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఆక్షేపించారు. మంత్రి ఈటల ప్రసంగం హెల్త్ బులెటిన్‌లా ఉందని విమర్శించారు. బుధవారం అసెంబ్లీలో కరోనా.. నివారణ చర్యలపై చర్చ సందర్భగా ఆయన మాట్లాడారు. కోవిడ్ నిధికి విరాళాలు ఇచ్చినవారిని గుర్తించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. కరోనా అనేక రంగాలపై ప్రభావం చూపిందన్నారు. అందుకు స్పందించిన సీఎం కేసీఆర్ మాట్లడుతూ.. అక్బరుద్దీన్ చేసిన విమర్శలను తప్పుబట్టారు. కరోనా నియంత్రణకు మంత్రి ఈటల ఆహర్నిషలు కృషిచేశారని ప్రశంసించారు. […]